
జనరల్

జానీ మాస్టర్ సతీమణి సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మిపై ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి నిరూపిత ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్‌కు, ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత నేపథ్యం, పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా వ్యాఖ్యానించి తన మనోభావాలను దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
ఈ వివాదంపై మీడియా ముందుకు రావద్దని, గొడవలను నివారించాలని పెద్దలు సూచించడంతో ఇంతకాలం మౌనంగా ఉన్నానని శేఖర్ మాస్టర్ తెలిపారు. యూనియన్ సభ్యుల ప్రయోజనాల కోసం ఎప్పుడూ ముందుండానని, పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని భావించినప్పుడు ఎన్నో పాటలను కూడా వదులుకున్నానని చెప్పారు. తనపై అనుచితంగా మాట్లాడిన సుమలత, లక్ష్మి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!