
జనరల్

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించి బలపడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40–50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!