
రాజకీయాలు

విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో అధికారికంగా విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. కొత్త విమానాశ్రయంలో అడుగుపెట్టిన తొలి ప్రయాణికులకు అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రయాణికులకు ఏటికొప్పాక సంప్రదాయ చెక్క బొమ్మలను జ్ఞాపికలుగా అందించారు. భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం కావడం ఈ ప్రాంత విమాన రవాణా రంగంలో కీలక పరిణామంగా నిలిచింది. భోగాపురం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో నేటి నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!