
టెక్నాలజీ

దసరా, దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది. అలాగే రేపు సికింద్రాబాద్–కాకినాడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నారు.
ఇక విశాఖపట్నం–బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నవంబర్ 25 వరకు, నర్సాపూర్–తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్ సర్వీసును నవంబర్ 30 వరకు కొనసాగించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. పండగల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు కొంత వెసులుబాటు కలగనుంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!