
రాజకీయాలు

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు విషయంపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త జోన్ వచ్చేనెల 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ జోన్‌కు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఉండనుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ల నుంచి విభజించి గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లను ఇందులో చేర్చారు.
వాల్టేర్ డివిజన్‌ను విభజించడం ఈ నిర్ణయంలో ముఖ్యాంశంగా నిలిచింది. ఒక భాగాన్ని రాయగడ డివిజన్‌గా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో చేర్చగా, మిగిలిన భాగాన్ని విశాఖ డివిజన్‌గా మార్చి సౌత్ కోస్ట్ రైల్వేలో చేర్చనున్నారు. ఈ మార్పులతో రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా మారి, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి వేగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!