
గాసిప్స్

కేటీఎం ఇండియా తన 160సీసీ మోటార్‌సైకిళ్ల ధరలను సవరించింది. 160 డ్యూక్, ఆర్‌సీ 160 బైక్‌ల ధరలు పెరిగాయి. గతంలో రూ.1.71 లక్షలుగా ఉన్న 160 డ్యూక్ స్టాండర్డ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.1.84 లక్షలకు చేరింది. దీంతో రూ.13,000 పెంపు నమోదైంది. TFT వేరియంట్ ధర కూడా రూ.1.79 లక్షల నుంచి రూ.1.91 లక్షలకు పెరిగింది.
ఫుల్లీ ఫెయిర్డ్ ఆర్‌సీ 160 ధర రూ.15,000 పెరిగింది. ఈ ఏడాది జనవరిలో రూ.1.85 లక్షలతో భారత్‌లో విడుదలైన ఈ బైక్ ఇప్పుడు రూ.2 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరకు చేరుకుంది. ఇందులో 164.2సీసీ ఇంజిన్ ఉండగా, 18.7 బీహెచ్‌పీ పవర్, 15.5 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. గతంలో జీఎస్టీ మార్పుల నేపథ్యంలో ద్విచక్ర వాహనాల ధరలు సవరించిన తర్వాత కేటీఎం నుంచి తాజా పెంపు వచ్చింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!