
జనరల్

పశ్చిమ బెంగాల్ భాజపా నేత సువేందు అధికారి ఎన్నికల అఫిడవిట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అఫిడవిట్లో ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.85.87 లక్షలుగా ప్రకటించినప్పటికీ, కారు, బంగారం లేవని, చేతిలో కేవలం రూ.12 వేల నగదు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఎలాంటి అప్పులు లేదా బకాయిలు లేవని కూడా పేర్కొన్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి ఇంత తక్కువ వ్యక్తిగత ఆస్తులు ప్రకటించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఆస్తుల్లో ఎక్కువ భాగం పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్లు, బీమా పాలసీలు, పూర్వ మేదినీపూర్ ప్రాంతంలోని స్థిరాస్తులకు సంబంధించినవేనని సమాచారం. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సాధించిన విజయానంతరం ఈ వివరాలు వెలుగులోకి రావడంతో రాజకీయ నాయకుల ఆస్తుల పారదర్శకతపై మరోసారి చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!