
బిజినెస్

సిక్కింలోని నామ్‌చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎన్‌హెచ్‌పీసీ తీస్తా స్టేజ్ 6 జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. ఒక్కసారిగా టన్నెల్ కూలిపోవడంతో లోపల పనిచేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి.
నామ్‌చి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్టు అధికారులతో కలిపి మొత్తం 25 మంది టన్నెల్‌లో చిక్కుకున్నారు. వారిలో 20 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ధృవీకరించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!