
జనరల్

హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల ఉదయ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న తన క్లాస్మేట్ అయిన యువతిని కారులో దిల్‌సుఖ్‌నగర్‌కు తీసుకెళ్లి, అనంతరం తిరిగి వస్తూ మద్యం కొనుగోలు చేశాడు.
తర్వాత బీడీఎల్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెకు కూడా మద్యం తాగించినట్లు పోలీసులు తెలిపారు. మత్తులో ఉన్న విద్యార్థినిని ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!