
షోస్

రాజమహేంద్రవరంలో మెడికోలను కారుతో ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి పరారైన నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన మెడికోలకు అవసరమైన వైద్య సహాయం అందించాలని, ముఖ్యంగా ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!