
జనరల్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:31 గంటల సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 24,602 వద్ద కొనసాగుతుండగా, సెన్సెక్స్ 266 పాయింట్లు పడిపోయి 78,684 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో పాటు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్ 99.97 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 83.4 డాలర్లుగా ఉంది. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.68 శాతానికి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో అమెరికా ఎస్ అండ్ పీ సూచీ 0.18 శాతం, నాస్‌డాక్ 0.06 శాతం నష్టపోవడం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!