
జనరల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సినీ ప్రముఖులకు కీలక సూచనలు చేశారు. ప్రముఖ సినీ కళాకారులకు ముఖ్యంగా యువతపై గణనీయమైన ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. విజయవంతమైన నటీనటులు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి మాట్లాడితే కోట్లాది మంది పిల్లలు, యువత వారిని అనుసరిస్తారని తెలిపారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు, ఉత్పత్తులకు సినీ ప్రముఖులు ప్రచారకర్తలుగా వ్యవహరించవద్దని ఆమె కోరారు.
ప్రముఖులుగా గుర్తింపు పొందినవారికి సమాజం పట్ల బాధ్యత కూడా ఉంటుందని రాష్ట్రపతి ముర్ము గుర్తుచేశారు. ‘‘నిజమైన స్టార్ అంటే వెలుగును పంచేవారు.. చీకటిని కాదు’’ అని ఆమె అన్నారు. సెప్టెంబర్ 22న గుజరాత్లోని ఏక్తా నగర్ (కేవడియా)లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!