

ప్రజలకు ప్రభుత్వ పౌర సేవలను మరింత సులభంగా అందించేందుకు ‘మీ సేవ డోర్ డెలివరీ సర్వీసెస్’కు శ్రీకారం చుట్టారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో బుధవారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ పూర్తయిన అనంతరం మీ సేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా దరఖాస్తుదారుల ఇంటి వద్దకు చేరుకుని సేవలను అందిస్తారు.
జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు సహా మీ సేవ ద్వారా అందించే ముఖ్యమైన పౌర సేవలను ఇంటి వద్దే పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, మీ సేవ వీఎల్‌ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలి దశలో ‘క్యూర్’ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను అమలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!