

రాయలసీమను ఉద్యాన పంటల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన హార్టికల్చర్ హబ్‌కు అక్టోబర్ 2న మదనపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి శంకుస్థాపన చేయనున్నారు. పురోదయ పథకం కింద ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, మరో రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను సమీకరించే లక్ష్యం ఉంది. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు.
మదనపల్లిలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రిలయన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సంస్థ వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, శిక్షణ అందించనుంది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 29న విజయవాడలో కర్మయోగి మిషన్ కార్యక్రమం, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ, 30న విజయవాడలో 24 వేల మందికి ఇంటి స్థలాల పట్టాల పంపిణీ, అక్టోబర్ 1న ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. అక్టోబర్ 2న మదనపల్లి కార్యక్రమం అనంతరం విజయవాడలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అక్టోబర్ 3న విజయవాడలో పాన్-ఐఐటీ సదస్సుకు హాజరవుతారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!