
ఓటీటీ

ఈనెల ప్రతిపాదిత దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఈనెల ఆదివారం బ్యాంకులు పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. బ్యాంకు శాఖలు, ఏటీఎం లకు అనుసంధానమైన కార్యాలయాలు, కరెన్సీ చెస్టులు కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి పొందాయి.
బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బ్యాంకు యూనియన్లు ఈనెల 28-30 వరకు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు యూనియన్లను కోరాయి. ఈనెల 26, 27 వారాంతపు సెలవుల తర్వాత సమ్మె ఉండటంతో శాఖల ద్వారా అందించే సేవలకు వరుసగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!