
జనరల్

తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పలు ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సచివాలయంలోని పలు శాఖల్లో పౌర సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటర్నెట్ ఆధారిత రోజువారీ అధికారిక కార్యకలాపాలు సైతం ప్రభావితమయ్యాయి.
సచివాలయంలోని మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్‌ఆర్‌ఐ అసిస్టెన్సీ సెల్‌లోనూ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారిక పనులతో పాటు పలు పౌర సేవలకు ఆటంకం ఏర్పడింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!