
రాజకీయాలు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ సాయుధుడు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. ఘటన అనంతరం కొద్దిసేపు వైట్‌హౌస్‌ను భద్రతా కారణాల వల్ల మూసివేశారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఘటన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ అదే మార్గంలో వెళ్లిన కొద్ది సేపటికే జరిగింది. కాల్పుల సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. ఈ ఘటనపై భద్రతా వైఫల్యం మరియు దాడి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!