
ఓటీటీ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేడు ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగానికి ఎస్‌ఈసీ అవసరమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!