
జనరల్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. గత 2025 మేలో జరిగిన తొలి పుష్కరాలకు 35 లక్షల మంది భక్తులు హాజరుకాగా, ఈసారి దాదాపు 40 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రారంభోత్సవం నిర్వహించనుండగా, ముఖ్యమంత్రి, గవర్నర్ పుణ్యస్నానం ఆచరించనున్నారు. భక్తుల సౌకర్యార్థం 3,360 ఆర్టీసీ బస్సులు, తాత్కాలిక బస్ స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రూ.23 కోట్లతో ఘాట్లు, రోడ్లు, టెంట్ సిటీ, ప్రసాద కౌంటర్లు వంటి విస్తృత అభివృద్ధి పనులు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!