
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశం ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుందని, దాన్ని కిందపడనివ్వబోమని స్పష్టం చేశారు. శనివారం వాషింగ్టన్‌లో జరిగిన 250వ స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ దేశభక్తి, విభజన రాజకీయాలపై మాట్లాడారు. ‘అమెరికన్ ఓటరు అర్హత రక్షణ చట్టం’ నినాదాన్ని మరోసారి ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
ఇక కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని చోట్ల వర్షాల కారణంగా వేడుకలకు అంతరాయం కలిగింది. ఇదే సమయంలో కోని ఐలాండ్‌లో బాణసంచా ప్రదర్శనను చూస్తున్న ప్రజలపై దుండగుడు కాల్పులు జరపగా ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్‌లో జరిగిన వేడుకలపై నీడ వేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!