
క్రీడలు

సాయి కృష్ణ అదృశ్య కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కూడా ఆమె కోరారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో పూర్తి నిజాలు వెలుగులోకి రావడం లేదని ఆరోపించిన ఆమె, విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులపై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
తాను ఫిర్యాదు చేసిన 45 రోజుల తర్వాతే కేసు నమోదు చేశారని, సీఐ నాగరాజు అరెస్టు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ నియమించిన సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగడం లేదని, కేసును ముగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!