
జనరల్

శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఓ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించినట్లు సమాచారం. వెంటనే ఏటీసీకి సమాచారం అందించిన పైలట్.. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి హైదరాబాద్ వైపు మళ్లించారు. అనంతరం విమానం శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.
విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అత్యవసర ల్యాండింగ్‌తో కొద్దిసేపు ఆందోళనకు గురైన ప్రయాణికులు, విమానం సురక్షితంగా నేలపైకి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే వెల్లడికాలేదు. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా ఇటీవల ఈ ప్రాంతంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు వెల్లడించాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!