

సంక్షోభ ప్రాంతాల్లో లైంగిక హింసపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వార్షిక నివేదిక తీవ్ర వివాదానికి దారితీసింది. ఇందులో రష్యా, ఇజ్రాయెల్ సైన్యాల పేర్లను చేర్చడంతో ఆ దేశాలు తీవ్రంగా స్పందించాయి. దాదాపు 15 ఏళ్ల నివేదిక చరిత్రలో తొలిసారి ఇజ్రాయెల్ పేరు చేర్చబడింది. పాలస్తీనాలో ఆ దేశ దళాలు చేసిన హింస ఆరోపణల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఉక్రెయిన్ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రష్యాను కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చారు. ఈ నివేదికను రష్యా ఐరాస రాయబారి వెసెల్లీ నింబెంజియా తీవ్రంగా ఖండించారు. తమ దేశాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ కూడా ఈ నివేదికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నివేదిక ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెర్రస్ పదవీకాలం ముగియనున్న సమయంలో విడుదల కావడం గమనార్హం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!