

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి మరియు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ పాలసీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఫ్యూచర్ సిటీ పూర్తిగా పర్యావరణహిత ‘నెట్ జీరో సిటీ’గా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అయిన తర్వాతే భూ కేటాయింపులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో భారీ డేటా సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ తెలంగాణకు రావాలంటే అవసరమైతే ప్రధాని మోదీని స్వయంగా కలుస్తానని సీఎం తెలిపారు. ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాలు కేటాయించనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!