
సినిమాలు

గురుకుల పాఠశాలల టెండర్లలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆరోపణలపై చర్చకు సిద్ధమని, దమ్ముంటే గన్‌పార్క్ వద్దకు రావాలని రాష్ట్ర మంత్రులు సవాల్ విసరడంతో బీఆర్‌ఎస్ నేతలు స్పందించారు.
ఈ సవాల్‌ను స్వీకరించిన మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు గన్‌పార్క్‌కు బయలుదేరారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!