
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలు నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒమన్ ఎయిర్‌వేస్ ద్వారా ప్రయాణించేందుకు సిద్ధమైన సమయంలో పత్రాల పరిశీలనలో లోపాలు బయటపడడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వారి ప్రయాణాన్ని అడ్డుకున్నారు.
అనంతరం మహిళలను శంషాబాద్ ఔట్‌పోస్టుకు అప్పగించి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఒక ఏజెంట్ మోసం చేశాడని మహిళలు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ఏజెంట్‌ను గుర్తించేందుకు మరియు ఈ మోసం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను వెలికితీయేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!