
సినిమాలు

భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 2024 సంవత్సరంలో జననాలు, మరణాల నమోదులో 99 శాతానికి పైగా నమోదు సాధించి దేశం కీలక మైలురాయిని అధిగమించింది. పౌర నమోదు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమైన విజయంగా అధికారులు పేర్కొంటున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఓఆర్‌జీఐ) విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్‌ఎస్) నివేదిక ప్రకారం, అంచనా వేసిన మొత్తం జననాల్లో 99.1 శాతం అంటే 2,54,73,389 జననాలు అధికారికంగా నమోదయ్యాయి. అలాగే అంచనా మరణాల్లో 99.4 శాతం అంటే 89,38,301 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పౌర నమోదు వ్యవస్థ సమర్థత పెరిగినట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!