
రాజకీయాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం ఈరోడ్ జిల్లాలోని పెరందురైలో నిర్వహించిన సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) బలోపేతం కోసం ఆయన ప్రభుత్వం రూ.1,110 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను మంజూరు చేసింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను సీఎం అందజేశారు. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతనివ్వడం, వాటి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో సీఎం విజయ్, స్వయం సహాయక సంఘాల సభ్యుల మధ్య చోటుచేసుకున్న ఆత్మీయ క్షణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలతో కలిసి ఆయన ఫొటోలు దిగారు. ఓ వృద్ధురాలు విజయ్ భుజంపై చేయివేసి ఫొటోకు పోజివ్వగా.. మరికొందరు సభ్యులు తమ గుర్తింపు కార్డులపై ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ఆత్మీయంగా మెలిగిన తీరు కార్యక్రమంలో సందడి నెలకొల్పింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!