

హైదరాబాద్‌లో కె. కవిత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో, దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే ఆయన పదవిలో కొనసాగకూడదని లేఖలో పేర్కొన్నారు. కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్ర విచారణ జరగేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె కోరారు.
పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసు మైనర్ బాలికకు సంబంధించినదని, దర్యాప్తు ప్రక్రియపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని కవిత అన్నారు. బండి సంజయ్ కీలక పదవిలో కొనసాగడం వల్ల సాక్ష్యాల సేకరణ, సాక్షుల రక్షణపై ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. బాధితురాలికి న్యాయం జరిగేందుకు, ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం నిలుపుకోవడానికి రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరగాలని, కేసు పూర్తయ్యే వరకు ఆయనను పదవి నుంచి తప్పించాలని కవిత లేఖలో స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!