

నటి రష్మిక మందన్న తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, సామాజిక సేవతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ పేరుతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, మహబూబ్నగర్, అనంతపురం, విజయవాడ, బెంగళూరు, చెన్నై, కొచ్చి, కొడగు ప్రాంతాల్లోని 400 పేద కుటుంబాలకు వచ్చే ఏడాది పాటు ఆహార సరుకులు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి ఆహార కిట్లో 75 కిలోల బియ్యం, 10 కిలోల గోధుమ పిండి, 15 కిలోల పప్పులు, 10 లీటర్ల వంట నూనెతో పాటు రాగులు, మసాలా దినుసులు, టీ పొడి వంటి నిత్యావసరాలు ఉంటాయని రష్మిక వివరించారు. ఈ సహాయం వల్ల కుటుంబాలు రోజువారీ ఖర్చులను తగ్గించుకుని, పిల్లల భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోగలవని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తన తాజా చిత్రం ‘రణబాలి’లోని జయమ్మ పాత్ర నుంచి ఈ ఆలోచనకు ప్రేరణ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!