
జనరల్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జవహర్ ఉద్యాన్‌లో ఉన్న మామిడి తోట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ప్రాంగణంలో ఉన్న ఈ తోటను సంస్థే నిర్వహిస్తోంది. ఇక్కడ 152కి పైగా రకాల మామిడులతో కూడిన సుమారు 1,800 చెట్లు ఉన్నాయి. నూర్జహాన్, మాల్దా, హాపూస్, దశేరీ, కేసర్, బ్లాక్ గోల్డ్ వంటి అరుదైన జాతులు కూడా ఉన్నాయి.
అయితే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది బ్లాక్ స్టోన్ మామిడి రకం. ఫ్రాన్స్‌కు చెందిన ఈ అరుదైన మామిడి పండ్లు ముదురు నలుపు లేదా పర్పుల్ రంగులో ఉంటాయి. పీచు లేకుండా ప్రత్యేక సువాసనతో ఉండే ఈ పండ్ల ధర కిలోకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. వాటి అరుదైనతనం, ప్రత్యేక రుచి కారణంగా వీటికి భారీ డిమాండ్ ఉన్నట్లు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సిబ్బంది తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!