
జనరల్

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్. రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథన్ను కలిసి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
లేఖను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 13న రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇది ఆయనకు ఐదోసారి సీఎం బాధ్యతలు చేపట్టడం కానుంది. ఎన్డీఏ కూటమికి అసెంబ్లీలో 18 స్థానాల బలం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!