
జనరల్

పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన పొదుపు సూచనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు చేశారు. బంగారం కొనవద్దు, విదేశీ ప్రయాణాలు తగ్గించండి, ఇంధనం, వంటనూనె వినియోగం తగ్గించండి, మెట్రోలో ప్రయాణించండి, ఇంటి నుంచే పని చేయండి వంటి సూచనలు ప్రజల శ్రేయస్సు కోసం కాదని, మోదీ వైఫల్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని నడిపే సామర్థ్యాన్ని ప్రధాని కోల్పోయారని ఆయన ఆరోపించారు.
అయితే భాజపా ఈ విమర్శలను ఖండించింది. ప్రధాని ప్రజలకు త్యాగాలు చేయాలని కోరలేదని, దేశ ప్రయోజనాల కోసం ఇంధన పొదుపు, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, విదేశీ మారక ద్రవ్యం ఆదా వంటి సూచనలు మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నిర్మాణంలో భాగం కాకుండా రాజకీయ విమర్శలకే పరిమితమైందని భాజపా నేతలు విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!