
జనరల్

భారత మహిళల హాకీ జట్టు వరల్డ్‌కప్ పోరును ఘనంగా ప్రారంభించింది. గ్రూప్-డి తొలి మ్యాచ్‌లో ఒలింపిక్ రజత పతక విజేత చైనాను 2-2తో డ్రా చేసింది. మ్యాచ్‌లో చైనా ఫేవరెట్‌గా బరిలోకి దిగినప్పటికీ.. భారత క్రీడాకారిణులు అద్భుతమైన వ్యూహంతో ఆడి ప్రత్యర్థిని సమర్థంగా కట్టడి చేశారు.
మ్యాచ్ 8వ నిమిషంలో నవ్‌నీత్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. 14వ నిమిషంలో జాంగ్ యింగ్ గోల్‌తో చైనా స్కోరును సమం చేసింది. 26వ నిమిషంలో దీపిక గోల్ చేసి భారత్‌కు మరోసారి ఆధిక్యాన్ని అందించింది. అయితే 39వ నిమిషంలో మా నింగ్ గోల్ చేయడంతో మ్యాచ్ 2-2తో సమమైంది. చివరి వరకు భారత్ రక్షణాత్మకంగా అద్భుతంగా ఆడి కీలక పాయింట్‌ను సాధించింది.
గ్రూప్-డి మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4-0తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!