

81వ ఐరాస సర్వసభ్య సమావేశాల కోసం న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయానికి వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఉగ్రవాదం, లష్కరే తయ్యిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌పై విలేకరులు ప్రశ్నలు సంధించారు. ప్రధాన కార్యాలయంలోకి వెళ్తున్న సమయంలో ‘‘ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు?’’ అని ప్రశ్నించగా షెహబాజ్ స్పందించలేదు. బయటకు వస్తున్న సమయంలో ‘‘హఫీజ్ సయీద్‌పై ఎప్పుడు విచారణ జరుపుతారు?’’ అని మరోసారి ప్రశ్నించగా కూడా సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళ్లిపోయారు.
భారత్, పాకిస్థాన్ మధ్య సీమాంతర ఉగ్రవాదం అంశంపై కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిషేధిత లష్కరే తయ్యిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్‌ను ఐరాస ఉగ్రవాదిగా గుర్తించింది. 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. 2025 పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లోనూ భారత జాతీయ దర్యాప్తు సంస్థ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంది. ఈ అంశాలపై భారత్ చేస్తున్న ఆరోపణలు, పాకిస్థాన్‌పై విమర్శలు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదంలో భాగంగా ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!