
షోస్

దీపావళి పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. వివిధ దేశాల్లోని భారతీయులు, ఇతర దీపావళి వేడుకల్లో పాల్గొనే ప్రజలు పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
దీపావళిని ఆశ, జ్ఞానానికి ప్రతీకగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా ఐక్యత, సానుకూలతను చాటే పండుగగా పేర్కొంది. చైనా, ఆస్ట్రేలియా, వెనిజులా తదితర దేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!