
జనరల్

సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రాకెట్ దుకాణంపై పడటంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో దుకాణంలోని టపాసులు వరుసగా పేలడంతో ఆ ప్రాంతమంతా భారీ శబ్దాలు, మంటలతో భయానకంగా మారింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఆస్తి నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారుల నుంచి రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!