

తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించినట్లు నమోదైన కేసులో అరెస్టయిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి పి. ఉదయ్ కృష్ణారెడ్డికి రంగారెడ్డి జిల్లా ఉప్పర్‌పల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ శివార్లలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో 2023 బ్యాచ్ శిక్షణ సమయంలో తనను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు.
ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన అనంతరం కేంద్ర హోం శాఖ ఆయన ప్రొబేషన్‌ను రద్దు చేసి సస్పెన్షన్ వేటు వేసింది. అరెస్టు తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో 60 రోజులకు పైగా న్యాయ రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా పూచీకత్తులు సమర్పించడం, దర్యాప్తునకు సహకరించడం వంటి షరతులతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు అప్పట్లో సివిల్ సర్వీసెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!