
జనరల్

బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో జరిగిన పట్టభద్రుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిగ్‌బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు హరి మీనన్ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. పాఠ్యపుస్తకాల కంటే క్యాంపస్ అనుభవాలే జీవితానికి నిజమైన పాఠాలు నేర్పుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, అనుభవాల ద్వారా నేర్చుకోవడం ముఖ్యం అని చెప్పారు.
అధిక వేతనాలు, హోదాల కంటే నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలని, తక్షణ లాభాల కంటే దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని తెలిపారు. కార్పొరేట్ ప్రపంచంలో అనుభవం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎంతో కీలకమని చెప్పారు. డిగ్రీ విజయానికి తొలి మెట్టే కానీ, భవిష్యత్తును నిర్మించేది క్యాంపస్ అనుభవాలేనని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!