

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న 80ల నాటి ట్రెండ్‌కు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా జతకడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే నేతలు సరదాగా ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ తమ పాతకాలపు రూపాలతో కూడిన చిత్రాలను పంచుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు 80ల నాటి రూపంలో ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
‘80ల ట్రెండ్‌లోకి అడుగుపెడుతున్నా’ అనే వ్యాఖ్యతో రేవంత్ రెడ్డి పాతకాలపు రూపంలోని చిత్రాన్ని పంచుకున్నారు. పాత యమహా ద్విచక్ర వాహనం, క్యాసెట్ రికార్డర్, పోస్టర్లతో కూడిన నేపథ్యంతో 80ల నాటి బెల్‌బాటమ్ దుస్తుల్లో ఆయన కనిపించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీని 80ల నాటి రూపంలో చూపిస్తూ చిత్రాన్ని పంచుకుంది. రాజకీయ వేడి కొనసాగుతున్న సమయంలో నేతలు ఇలాంటి సామాజిక మాధ్యమ ట్రెండ్లను అనుసరించడం యువతతో మరింత అనుసంధానం పెంచుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!