

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలైన మైనర్ బాలిక తల్లి సవివర ప్రకటన విడుదల చేశారు. తన కుమార్తెను మాయమాటలతో మానసికంగా ప్రభావితం చేసి, పలుమార్లు బలవంతంగా శారీరక సంబంధాల కోసం ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ముఖ్యంగా మోయినాబాద్లో జరిగిన ఘటనలో తన కుమార్తెపై దాడి జరిగిందని పేర్కొన్నారు. న్యాయం కోసం బండి సంజయ్ ఇంటికి వెళ్లినప్పుడు తమకు భరోసా కాకుండా బెదిరింపులు ఎదురయ్యాయని తల్లి వాపోయారు.
పోక్సో చట్టం కింద ఫిర్యాదు నమోదు చేయించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఆలస్యం జరిగిందని, జీరో ఎఫ్ఐఆర్ కోసం పట్టుబట్టాల్సి వచ్చిందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి గుర్తింపును బయటపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని, స్వతంత్రంగా మరియు నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!