

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ (30) మృతి చెందారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కలిపి ఆమెకు సుమారు 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోలు మిలియన్ల వ్యూస్ సాధించేవి. 2024లో ‘మిస్ ప్రిటీ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకున్న నిధి.. మోడలింగ్, నటన రంగాల్లో కెరీర్ కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. శనివారం ఆమె ఇంట్లో మృతి చెందగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
నిధి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు ముందు ఆమె ఫోన్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో, ఆ సంభాషణలు, ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ కార్యకలాపాలు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన సమాచారాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఆమె మృతికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రావద్దని పోలీసులు సూచించారు. నిధి మృతి వార్తతో ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!