
జనరల్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మే 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిరసన కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధార్థ్ రెడ్డి, మంత్రి టీజీ భరత్ ఒక ఫార్మా కంపెనీ నుంచి రూ.45 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపించారు. అలాగే మంత్రి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీజీ వెంకటేష్పై కూడా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉన్నాయని మంత్రి భరత్ ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!