

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్రంలోని కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ద్వారా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యలను శాఖల సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!