

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రావు బహదూర్’ చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు సమర్పణలో వచ్చిన ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా సత్యదేవ్ నటనకు ప్రశంసలు రావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. కథనం, పాత్రల రూపకల్పన, భావోద్వేగాల ప్రదర్శన ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలోనూ దృష్టిని ఆకర్షిస్తున్నట్లు సమాచారం. విదేశీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు సినిమాపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తొలుత కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించాలనే ఆలోచన ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాను ఇతర భాషల్లో డబ్ చేయాలా లేదా అంతర్జాతీయ నటీనటులతో రీమేక్ చేయాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!