
సినిమాలు

E85 ఇంధనం లీటర్‌కు సుమారు ₹20 తక్కువ ధరలో అందుబాటులోకి రావొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపినా, E20 పెట్రోల్ ధరలో పెద్దగా తగ్గుదల కనిపించకపోవడానికి ఇథనాల్ ఉత్పత్తి వ్యయమే ప్రధాన కారణమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం లీటర్ ఇథనాల్ కొనుగోలు ధర ₹71.86 కాగా, దీనికి నిల్వ, రవాణా, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు కూడా చేరుతున్నాయి.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం ఉన్న బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 120–130 డాలర్ల వరకు పెరిగితే, స్వచ్ఛమైన పెట్రోల్ తయారీ వ్యయం పెరుగుతుందని కేంద్రం తెలిపింది. అలాంటి పరిస్థితుల్లో ఇథనాల్ మిశ్రమ ఇంధనమైన E20 ధర తులనాత్మకంగా మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!