

కోలీవుడ్‌లో విజయవంతమైన కాంబినేషన్‌గా పేరుగాంచిన నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ మరో ప్రతిష్ఠాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘పొల్లాదవన్’, ‘ఆడుగళం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న కొత్త చిత్రానికి ‘తమిళ్ మురుగన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘గాడ్ ఆఫ్ వార్’ ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం చారిత్రక యాక్షన్ కథాంశంతో భారీ స్థాయిలో తెరకెక్కనుందని సమాచారం.
ఇదే సమయంలో టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’ పేరుతో మరో భారీ ప్రాజెక్ట్‌పై చర్చ జరుగుతోంది. రెండు చిత్రాల కథాంశాలు సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో ఉంటాయనే వార్తలతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ధనుష్ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!