

ఫైల్స్ క్లియరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రెండో రోజు జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్‌రెడ్డి ఫైల్స్ క్లియరెన్స్‌లో చివరి స్థానంలో ఉన్నారని చెప్పారు. రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ ఫైళ్లను క్లియర్ చేయడానికి అధిక సమయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని సీఎం సూచించారు.
ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు ఫైళ్లను క్లియర్ చేయడానికి తీసుకుంటున్న సమయంపైనా చంద్రబాబు సమీక్షించారు. చాలా మంది కార్యదర్శులు రెండు రోజుల్లోనే ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని, కొందరు శాఖాధిపతులు మాత్రం మూడు రోజుల సమయం తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు ఇంత సమయం ఎందుకు పడుతోందో వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను సమావేశంలోనే ఆదేశించారు. పనితీరును మెరుగుపరుచుకుని నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని మంత్రులు, అధికారులకు సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!