
జనరల్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల సుదీర్ఘ విదేశీ పర్యటనలో చివరి దశగా నిన్న సాయంత్రం ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజానీ స్వయంగా ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం అందించారు.
ప్రధాని రాకతో రోమ్‌లోని భారతీయ సమాజంలో భారీ ఉత్సాహం నెలకొంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాస భారతీయులను మోదీ కలుసుకుని ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆయన గౌరవార్థం నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమంలో భారతీయ, ఇటాలియన్ సంస్కృతుల సమ్మేళనంగా నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!