

మీడియాతో తనకు సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపత్తులు, సంక్షోభాల సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులు ప్రజలకు సమాచారం అందించేందుకు ఎంతో శ్రమిస్తారని ప్రశంసించారు. దిల్లీలోని BJP ప్రధాన కార్యాలయంలో జర్నలిస్టుల కోసం నిర్వహించిన ప్రత్యేక ‘దీపావళి మిలన్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. BJPలో చేరిన తొలినాళ్లలో మీడియా కార్యక్రమాలకు కుర్చీలు వేసే బాధ్యతను తాను నిర్వర్తించేవాడినని తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
గత కొన్నేళ్లలో జర్నలిజం రంగంలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని మోదీ వివరించారు. ఒకప్పుడు మీడియా సమావేశాల ప్రసారం కోసం అవుట్‌సైడ్ బ్రాడ్‌కాస్ట్ వ్యాన్లపై ఆధారపడేవారని, ఇప్పుడు మొబైల్ ఫోన్లే ఆ పనిని చేస్తున్నాయని అన్నారు. గతంలో పత్రికా ప్రకటనల ద్వారా సమాచారం అందించేవారని, ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా వార్తలు వేగంగా ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ, గత 12 ఏళ్లలో 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసినట్లు తెలిపారు. దేశంలో విజయాలు సాధించిన సామాన్యుల కథనాలను ప్రపంచానికి తెలియజేయాలని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జర్నలిస్టులకు సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!